25, జులై 2021, ఆదివారం

ఎనుబదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియాఱవ పద్యము:

చంపకమాల:
కృత వర గర్వియై కనల, ఖేచరులే కని కాలనేమి, సం
తత భయులై, కడున్ జెదరి, నమ్మియు వే నినుఁ జేరి, పొంద నా
ర్ద్రతఁ, ద్వర నంద నీ శరణు, తార్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి, చం
పి, తనరితే! హరీ! తునిమి, మెప్పుల నందితె తుష్టిఁ గేశవా! 86

గర్భిత కందము:
వర గర్వియై కనల, ఖే
చరులే కని కాలనేమి, సంతత భయులై,
త్వర నంద నీ శరణు, తా
ర్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి, చంపి, తనరితే! 86

గర్భిత తేటగీతి:
కనల, ఖేచరులే కని కాలనేమిఁ,
జెదరి, నమ్మియు వే నినుఁ జేరి, పొంద
శరణు, తార్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి,
తునిమి, మెప్పుల నందితె తుష్టిఁ గేశ! 86



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి