25, జులై 2021, ఆదివారం

ఎనుబదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియేడవ పద్యము:

చంపకమాల:
కల మెయిఁ బిన్నటన్ జదల కాన్కయునౌ శశి, రామచంద్ర! కా
వలెననుచో, వెసన్ దరికి వచ్చియు, మంత్రి సుమంత్రుఁ డప్డుఁ దా
నల, పయిఁ జంద్రునే, యహహ! యమ్మెయి నద్దము నందుఁ జూపి, మె
ప్పులఁ గొనఁడే! హరీ! మదినిఁ బూర్తిగఁ గెల్వఁడె! మాన్య! కేశవా! 87

గర్భిత కందము:
మెయిఁ బిన్నటం, జదల కా
న్కయునౌ శశి, రామచంద్ర! కావలెననుచోఁ
బయిఁ జంద్రునే యహహ! య
మ్మెయి నద్దము నందుఁ జూపి, మెప్పులఁ గొనఁడే! 87

గర్భిత తేటగీతి:
చదల కాన్కయునౌ శశి, రామచంద్ర!
దరికి వచ్చియు, మంత్రి సుమంత్రుఁ డప్డు,
నహహ! యమ్మెయి నద్దము నందుఁ జూపి,
మదినిఁ బూర్తిగఁ గెల్వఁడె! మాన్య! కేశ! 87



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి