12, జూన్ 2021, శనివారం

ముప్పదియవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]



ముప్పదియవ పద్యము:

చంపకమాల:
వనిఁ జని, సౌరికై మలసి, వాలిని, భూజము మాటుఁ జంపి, ప్రే
క్షను గరుణన్ వెసం గుదురుగా ఘన నిర్వృతిఁ గూర్పఁజేసి, లి
ప్సను గొని, రాఘవా! నృపుగ సౌరి నొనర్చియు, స్నేహధర్మి! ప్రీ
తిని నిడితే! హరీ! మహిని దిద్ది, వెలింగిన మాన్య కేశవా! 30

గర్భిత కందము:
చని, సౌరికై మలసి, వా
లిని, భూజము మాటుఁ జంపి, ప్రేక్షను గరుణన్
గొని, రాఘవా! నృపుగ సౌ
రి నొనర్చియు, స్నేహధర్మి! ప్రీతిని నిడితే! 30

గర్భిత తేటగీతి:
మలసి, వాలిని, భూజము మాటుఁ జంపి,
కుదురుగా ఘన నిర్వృతిఁ గూర్పఁజేసి,
నృపుగ సౌరి నొనర్చియు, స్నేహధర్మి!
మహిని దిద్ది, వెలింగిన మాన్య! కేశ! 30


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి