13, జూన్ 2021, ఆదివారం

ముప్పదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదియొకటవ పద్యము:

చంపకమాల:
ధ్రువ గుణయుక్తయౌ వెలఁది రుక్మిణి, ప్రేమనుఁ బిల్వ నంప, మె
చ్చి, వలచియున్ వెసం బ్రియనుఁ జేరఁగ వచ్చియుఁ, బెండ్లియాడి, గె
ల్తువె రణమం దరిం బఱచి, రుక్మిణిఁ గొంటివె వాసుదేవ! మీ
ఱి వెలిఁగితే! హరీ! నతులు శ్రీవర! కావుమ నన్నుఁ గేశవా! 31

గర్భిత కందము:
గుణయుక్తయౌ వెలఁది రు
క్మిణి, ప్రేమనుఁ బిల్వ నంప, మెచ్చి, వలచియున్,
రణమం దరిం బఱచి, రు
క్మిణిఁ గొంటివె వాసుదేవ! మీఱి వెలిఁగితే! 31

గర్భిత తేటగీతి:
వెలఁది రుక్మిణి, ప్రేమనుఁ బిల్వ నంపఁ,
బ్రియనుఁ జేరఁగ వచ్చియుఁ, బెండ్లియాడి,
పఱచి, రుక్మిణిఁ గొంటివె వాసుదేవ!
నతులు శ్రీవర! కావుమ నన్నుఁ గేశ! 31



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి