5, ఆగస్టు 2021, గురువారం

నూఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూఱవ పద్యము:

చంపకమాల:
త్వర, ఘన! రాఘవా! మిగులఁ దప్తుని భద్రుని మెచ్చి, నీవు, భూ
ధరము పయిం గడుం దొడరి, దారయుఁ దమ్ముఁడు తోడనుండ, స్వం
కుర ఘన భక్తితో గుడిని గోపన గట్టఁగఁ, గూర్మి నుంటె, ప్ర
స్ఫుర కృపతోన్, వెసం బ్రజలఁ బ్రోచుచు, నో రఘురామ! కేశవా! 100

గర్భిత కందము:
ఘన! రాఘవా! మిగులఁ ద
ప్తుని భద్రుని మెచ్చి, నీవు, భూధరము పయిన్
ఘన భక్తితో గుడిని గో
పన గట్టఁగఁ, గూర్మి నుంటె, ప్రస్ఫుర కృపతోన్! 100

గర్భిత తేటగీతి:
మిగులఁ దప్తుని భద్రుని మెచ్చి, నీవుఁ
దొడరి, దారయుఁ దమ్ముఁడు తోడనుండ,
గుడిని గోపన గట్టఁగఁ, గూర్మి నుంటె,
ప్రజలఁ బ్రోచుచు, నో రఘురామ! కేశ! 100



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

6 కామెంట్‌లు:

  1. అభినందనలు. చక్కగా నూఱుపద్యాలనూ పూర్తిచేసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ శ్యామలరావుగారూ! మీవంటి పెద్దల ఆశీర్బలంతో కొనసాగిస్తున్నాను. అష్టోత్తరశతం వరకు కొనసాగిస్తాను.

      తొలగించండి
    2. నూట ఎనిమిది - వేదపురుషుని సంజ్ఞాత్మకమైన దివ్యసంఖ్య!
      నూట ఎనిమిది - మాయకు లోబడిన ప్రకృతి యొక్క దివ్యసంఖ్య!
      నూట ఎనిమిది - శ్రీచక్ర మూలప్రకృతి యొక్క దివ్యసంఖ్య!

      తొలగించండి
    3. ఆవునండీ! అందుకే ఆ సంఖ్యతో నా శతకాన్ని ముగించాను. స్పందించినందులకు ధన్యవాదాలు!

      తొలగించండి
  2. రాశిచక్రంలోని నవాంశల సంఖ్య నూటయెనిమిది. స్తోత్రపారాయణాదులు ముఖ్యంగా గ్రహశాంతి కోసం చేస్తారు. అందుకే రాశిచక్రంతో జోడింపుగా నూటయెనిమిది సంఖ్యాగణనం వాటలో.

    రిప్లయితొలగించండి