14, జులై 2021, బుధవారం

డెబ్బదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియొకటవ పద్యము:

చంపకమాల:
గురు! వసుధేశ్వరా! యబల కుబ్జ సుగంధము లాని, చొక్కి, సం
బరపడుచున్, వెసన్ బడుచు పజ్జనుఁ జేరి, త్రివక్రమూడ్చి, సుం
దరి పస యబ్బఁగా, స్థిరత నవ్య సుకోమల దేహమిత్తె! యం
దఱు కనఁగన్! హరీ! ప్రణతి దైత్యనిహంత! శుభాంగ! కేశవా! 71

గర్భిత కందము:
వసుధేశ్వరా! యబల కు
బ్జ సుగంధము లాని, చొక్కి, సంబరపడుచున్,
పస యబ్బఁగా, స్థిరత న
వ్య సుకోమల దేహమిత్తె! యందఱు కనఁగన్! 71

గర్భిత తేటగీతి:
అబల కుబ్జ సుగంధము లాని, చొక్కి,
పడుచు పజ్జనుఁ జేరి, త్రివక్రమూడ్చి,
స్థిరత నవ్య సుకోమల దేహమిత్తె!
ప్రణతి దైత్యనిహంత! శుభాంగ! కేశ! 71



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి