23, జులై 2021, శుక్రవారం

ఎనుబదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదిమూఁడవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ లలితాత్మకా! పఱపి ప్రేక్షల, నాస్తిక వాద మూన జా
బాలియె, నీ నుడుల్ పలికి, స్వాంతముఁ దెల్పియుఁ, బ్రాఙ్మతాప్తి రా
మా! లలి వాదముల్ నెఱపి, మాన్యుల యాస్తిక నేతవయ్యునుం
దేలితివే! హరీ! పృథివిఁ దేర్చితె ధార్మిక రీతిఁ గేశవా! 83

గర్భిత కందము:
లలితాత్మకా! పఱపి ప్రే
క్షల, నాస్తిక వాద మూన జాబాలియె, నీ
లలి వాదముల్ నెఱపి, మా
న్యుల యాస్తిక నేతవయ్యునుం దేలితివే! 83

గర్భిత తేటగీతి:
పఱపి ప్రేక్షల, నాస్తిక వాద మూనఁ,
బలికి, స్వాంతముఁ దెల్పియుఁ, బ్రాఙ్మతాప్తి
నెఱపి, మాన్యుల యాస్తిక నేతవయ్యుఁ
బృథివిఁ దేర్చితె ధార్మిక రీతిఁ గేశ! 83



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి