22, జులై 2021, గురువారం

ఎనుబదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియొకటవ పద్యము:

చంపకమాల:
భువిఁ గన, రాఘవా! పొడనుఁ బొందిన ధర్మమె పొల్చినట్లు నీ
వవు నడతల్ గడున్ జనుల కచ్చు వడంగఁ, బ్రశంసలంది, యో
ధ్రువ! దనుజాళినిం జెలఁగ, దుష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి, క్షో
ణి వఱలితే! హరీ! త్రి వ్రత నిష్ఠను వెల్గితె ప్రీతిఁ గేశవా! 81

గర్భిత కందము:
కన, రాఘవా! పొడనుఁ బొం
దిన ధర్మమె పొల్చినట్లు నీవవు నడతల్
దనుజాళినిం జెలఁగ, దు
ష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి, క్షోణి వఱలితే! 81

గర్భిత తేటగీతి:
పొడనుఁ బొందిన ధర్మమె పొల్చినట్లు,
జనుల కచ్చు వడంగఁ, బ్రశంసలంది,
చెలఁగ దుష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి,
త్రి వ్రత నిష్ఠను వెల్గితె ప్రీతిఁ గేశ! 81



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి