27, జులై 2021, మంగళవారం

ఎనుబదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
మన, జగదీశ్వరా! పరఁగ మామ, గజమ్మునుఁ బంపఁగాను, మా
ర్పనుఁ జనియుం, గడున్ ఘన దురమ్మున, సింహ విఘాత రీతి, ది
గ్గనఁ దగఁ గ్రుమ్మియున్ సరగఁ గంసు గజమ్మునుఁ జంపినావె, జో
రునఁ బొగడన్, హరీ! వెలిఁగి, రుండికఁ జేరవె! వృష్ణి! కేశవా! 88

గర్భిత కందము:
జగదీశ్వరా! పరఁగ మా
మ, గజమ్మునుఁ బంపఁగాను, మార్పనుఁ జనియున్,
దగఁ గ్రుమ్మియున్ సరగఁ గం
సు గజమ్మునుఁ జంపినావె, జోరునఁ బొగడన్! 88

గర్భిత తేటగీతి:
పరఁగ మామ, గజమ్మునుఁ బంపఁగాను,
ఘన దురమ్మున, సింహ విఘాత రీతి,
సరగఁ గంసు గజమ్మునుఁ జంపినావె!
వెలిఁగి, రుండికఁ జేరవె! వృష్ణి! కేశ! 88



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి