7, జులై 2021, బుధవారం

అఱువదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదిరెండవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ యమృతేశయా! నర వరేణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి! నా
రాయణ! సత్తపః స్థిరత వ్రక్కలు సేయఁగ దేవవేశ్య లా
హా! యమనమ్మునౌ నృతి వరాంశము "నూర్వశి సృష్టి" యాఁపె శౌ
రీ! యహహా! యదే యుపద యింద్రున కేఁగె నియుక్తిఁ గేశవా! 62

గర్భిత కందము:
అమృతేశయా! నర వరే
ణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి! నారాయణ! స
ద్యమనమ్మునౌ నృతి వరాం
శము "నూర్వశి సృష్టి" యాఁపె శౌరీ! యహహా! 62

గర్భిత తేటగీతి:
నర వరేణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి!
స్థిరత వ్రక్కలు సేయఁగ దేవవేశ్య
నృతి వరాంశము "నూర్వశి సృష్టి" యాఁపె!
నుపద యింద్రున కేఁగె నియుక్తిఁ గేశ! 62



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి