17, జులై 2021, శనివారం

డెబ్బదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]



డెబ్బదిమూఁడవ పద్యము:

చంపకమాల:
ద్రుమ మిల నీడయౌ పసుల దోగ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు జ్ఞా
నమె యుడుగన్, హరీ మహిమ నత్తఱిఁ జూపితి, మామమామ! యా
మము లిల సాలు కాన్, నిఖిల మాయలఁ ద్రుంచి, గణించి, నీవె యా
భ్రమ విడితే! నినున్ దెలిపి, వాక్పతిఁ దేర్చితె దీక్షఁ గేశవా! 73

గర్భిత కందము:
ఇల నీడయౌ పసుల దో
గ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు జ్ఞానమె యుడుగ,
న్నిల సాలు కాన్, నిఖిల మా
యలఁ ద్రుంచి, గణించి, నీవె యా భ్రమ విడితే! 73

గర్భిత తేటగీతి:
పసుల దోగ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు
మహిమ నత్తఱిఁ జూపితి, మామమామ!
నిఖిల మాయలఁ ద్రుంచి, గణించి, నీవె
తెలిపి, వాక్పతిఁ దేర్చితె దీక్షఁ గేశ! 73



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి