12, జులై 2021, సోమవారం

అఱువదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
భజ దనుజారి! యా యుదధి, బాలుని, పంచజనోక్త దైత్యుఁ డొ
క్క జబురు కా, న్వెసం గడుపుఁ గంబువు నందు విగాహిఁ జేయఁ, జౌ
బుజ! చని, చీల్చియుం గనక బొందిని బాలునిఁ, గంబు వొంది, తె
త్తె జము దరి న్నతు ల్గొని, ద్రుతి న్గురు సూనునిఁ గూర్తె! కేశవా! 
68

గర్భిత కందము:
దనుజారి! యా యుదధి, బా
లుని, పంచజనోక్త దైత్యుఁ డొక్క జబురు కా,
న్జని, చీల్చియుం గనక బొం
దిని బాలునిఁ, గంబు వొంది, తెత్తె జము దరిన్! 
68

గర్భిత తేటగీతి:
ఉదధి, బాలుని, పంచజనోక్త దైత్యు
కడుపుఁ గంబువు నందు విగాహిఁ జేయఁ,
గనక బొందిని బాలునిఁ, గంబు వొంది,
కొని, ద్రుతి న్గురు సూనునిఁ గూర్తె! కేశ! 68



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి