6, జులై 2021, మంగళవారం

అఱువదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

అఱువదియొకటవ పద్యము:

చంపకమాల:
అల సురదైత్యులే యమృత మంద రహించిన యంచయాన నా
మలహరుఁడే వెసం గన రమావర! నిన్నునుఁ గాంక్ష వేఁడ, తా
నిలఁ బరికింప, నీ వపుడు హేల రసోద్ధతి నాడి, మాయలన్
నిలిపితివే! హరీ! దెస గణించియు, మాయనుఁ ద్రెంతె! కేశవా! 61

గర్భిత కందము:
సురదైత్యులే యమృత మం
ద రహించిన యంచయాన నా మలహరుఁడే
పరికింప, నీ వపుడు హే
ల రసోద్ధతి నాడి, మాయలన్ నిలిపితివే! 61

గర్భిత తేటగీతి:
అమృత మంద రహించిన యంచయానఁ
గన, రమావర! నిన్నునుఁ గాంక్ష వేఁడ,
నపుడు హేల రసోద్ధతి నాడి, మాయ
దెస గణించియు, మాయనుఁ ద్రెంతె! కేశ! 61



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి