5, జులై 2021, సోమవారం

అఱువదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదవ పద్యము:

చంపకమాల:
నిజ బలగర్వియై పరఁగ నీ కల పూతన పాల నీయఁగా
ను జతనయై వెసన్ సరవి నూతన యుక్తినిఁ జంపఁ బూని దై
త్యజ చెలఁగన్, హరీ! యపుడు హాహల దుగ్ధము లాని, కొంటె యా
వృజిన యసుల్ సనన్ మనికిఁ బీల్చియు వెల్గితె! మాన్య! కేశవా! 60

గర్భిత కందము:
బలగర్వియై పరఁగ నీ
కల పూతన పాల నీయఁగాను జతనయై
చెలఁగన్, హరీ! యపుడు హా
హల దుగ్ధము లాని, కొంటె యా వృజిన యసుల్! 60

గర్భిత తేటగీతి:
పరఁగ నీ కల పూతన పాల నీయ,
సరవి నూతన యుక్తినిఁ జంపఁ బూని,
యపుడు హాహల దుగ్ధము లాని, కొంటె!
మనికిఁ బీల్చియు వెల్గితె! మాన్య! కేశ! 60



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి